కేంద్రం ఆధ్వర్యంలో ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

తెలుగు జాతికి గర్వకారణమైన ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Published : 05 Oct 2022 05:29 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
మురళీమోహన్‌కు అక్కినేని జీవన సాఫల్య పురస్కారం ప్రదానం

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: తెలుగు జాతికి గర్వకారణమైన ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. డా.అక్కినేని నాగేశ్వరరావు జయంతి (సెప్టెంబరు20)ని పురస్కరించుకొని ‘తేజస్విని కల్చరల్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ‘నవరస దీప్తి- నటరాజమూర్తి ఏయన్నార్‌’ శీర్షికన మంగళవారం సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు, నిర్మాత ఎం.మురళీమోహన్‌కు అక్కినేని జీవిత సాఫల్య పురస్కారాన్ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చేతులమీదుగా ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సినీ రంగానికి ఏయన్నార్‌, ఎన్టీఆర్‌ రెండు కళ్లు వంటివారన్నారు. అక్కినేని విజయంలో ఘంటసాల పాత్ర ప్రముఖంగా ఉందన్నారు. ‘గాయకునిగానే అందరికీ తెలిసిన ఘంటసాల.. స్వాతంత్య్ర సమరయోధుడు కూడా’ అని కొనియాడారు. ఆయన శతజయంతి ఉత్సవాలను భారత ప్రభుత్వం పక్షాన నిర్వహిస్తామంటే ప్రధాని నరేంద్రమోదీ వెంటనే అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిజాయితీకి అక్కినేని మారుపేరని, మురళీమోహన్‌ అదే కోవకు చెందినవారని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్‌.బి.సుధాకర్‌, వీబీ లా ఛాంబర్స్‌ ఛైర్మన్‌ డా.పి.విజయబాబు, సాహితీవేత్త వోలేటి పార్వతీశం, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు