ఆర్టీసీకి సరికొత్త సాంకేతిక సొబగులు

అన్ని విభాగాలను ఏకీకృత వ్యవస్థ ద్వారా నడిపించేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.

Published : 31 Jan 2023 03:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: అన్ని విభాగాలను ఏకీకృత వ్యవస్థ ద్వారా నడిపించేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. డిపోల నుంచి బస్‌ భవన్‌, ఉద్యోగుల వ్యవహారాల నుంచి ఆదాయవ్యయాల వరకు అన్నింటినీ అనుసంధానం చేయడం ద్వారా పని తీరు మరింత మెరుగుపడేందుకు ఒరాకిల్‌ ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌(ఈఆర్పీ) సాంకేతికతను వినియోగించుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన నల్సాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బస్‌భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రెండు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సేవలను, ఆదాయాన్ని పక్కాగా నిర్వహించడానికి ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని సజ్జనార్‌ తెలిపారు. తొమ్మిది నెలల్లో ఆ సంస్థ ప్రాజెక్టును అమలు చేస్తుందన్నారు. దేశంలోని రోడ్డు రవాణా సంస్థల్లో ఈ తరహా ఒప్పందం చేసుకున్నది టీఎస్‌ఆర్టీసీనేనని అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని