బీసీలకు ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌దే

రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మగౌరవం దక్కలేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బీసీ కుల భవనాలకు స్థలాలు కావాలని నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని అడిగితే నవ్వి వదిలేశారన్నారు.

Updated : 05 Feb 2023 05:39 IST

మంత్రి గంగుల కమలాకర్‌

ఉప్పల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మగౌరవం దక్కలేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బీసీ కుల భవనాలకు స్థలాలు కావాలని నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని అడిగితే నవ్వి వదిలేశారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ భగాయత్‌లో వంజర కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శనివారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కమలాకర్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. ‘‘బీసీలు ఉమ్మడి రాష్ట్రంలో పదవుల్లో వెనకకు నెట్టివేయబడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడా.. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు  కృషి చేస్తున్నారు. 41 బీసీ కులాలకు హైదరాబాద్‌ నడిబొడ్డున 85 ఎకరాలు కేటాయించి, ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు ఎకరాకు రూ.కోటి చొప్పున నిధులు ఇచ్చారు’’ అని తెలిపారు.

భూమి పుట్టినప్పటి నుంచి మంత్రి..: మా అన్న తలసాని భూమి పుట్టినప్పటి నుంచి మంత్రిగానే ఉన్నారంటూ.. మంత్రి గంగుల అనగానే సభలో నవ్వులు విరిశాయి. కార్యక్రమంలో ఉప్పల్‌, అంబర్‌పేట ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, కాలేరు వెంకటేష్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, వంజరి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని