పౌష్టికాహారానికి నిధుల పుష్టి

రాష్ట్రంలో చిన్నారులు, కౌమారదశ బాలికలు, మహిళల్లో రక్తహీనతను అధిగమించేందుకు చేపట్టిన పౌష్టికాహార కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు పెంచింది.

Published : 07 Feb 2023 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చిన్నారులు, కౌమారదశ బాలికలు, మహిళల్లో రక్తహీనతను అధిగమించేందుకు చేపట్టిన పౌష్టికాహార కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు పెంచింది. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖలకు కలిపి మొత్తం రూ.2,059.75 కోట్లు కేటాయించింది. ఇందులో జాతీయ పౌష్టికాహార మిషన్‌ కింద రూ.543.62 కోట్లు, ఆరోగ్యలక్ష్మి పథకానికి రూ.225.41 కోట్లు కలిపి.. మొత్తం రూ.769.03 కోట్లు ఇచ్చింది. స్వధార్‌ గృహాలకు రూ.10.34 కోట్లు, చిన్నారుల భద్రత పథకానికి రూ.20.10 కోట్లు, చిన్నారుల అభివృద్ధి కార్యక్రమాలకు రూ.22.46 కోట్లు ఇచ్చింది. మహిళా కార్పొరేషన్‌కు రూ.3.94 కోట్లు, మహిళా కమిషన్‌కు రూ.45 లక్షలు, వేధింపులకు గురైన బాలికలు, మహిళలకిచ్చే ఆర్థిక సాయానికి రూ.1.06 కోట్లు కేటాయించింది. అంగన్‌వాడీ కేంద్రాల శాశ్వత భవనాలకు రూ.33 లక్షలే ఇచ్చింది. మహిళల భద్రతకు రూ.14 కోట్లు, బాలల న్యాయ నిధికి రూ.9 కోట్లు, దివ్యాంగుల పునరావాసానికి రూ.5.51 కోట్లు, వివాహ ప్రోత్సాహకాలకు రూ.4.2 కోట్లు కేటాయించింది.


మహిళా శిశు సంక్షేమశాఖకు కేటాయింపులు ఇలా..

నిర్వహణ పద్దు : రూ.1,139.92 కోట్లు

ప్రగతి పద్దు : రూ.919.83 కోట్లు

మొత్తం : రూ.2,059.75 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని