వైద్యవిద్య కోర్సుల ఫీజుల నిర్ణయానికి.. ఆర్థిక వివరాలు పంపండి

రాష్ట్రంలో వైద్య విద్య, నర్సింగ్‌, పారామెడికల్‌ సహా వైద్యరంగానికి సంబంధించిన కోర్సులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు 2023-24 విద్యాసంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలులో.

Published : 01 Apr 2023 04:49 IST

విద్యాసంస్థలకు టీఏఎఫ్‌ఆర్‌సీ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య విద్య, నర్సింగ్‌, పారామెడికల్‌ సహా వైద్యరంగానికి సంబంధించిన కోర్సులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు 2023-24 విద్యాసంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలులో ఉండే ఫీజులపై నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆర్థిక వివరాలు పంపాలని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఆదేశించింది. సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ కోర్సులు, ఎంబీబీఎస్‌, పీజీ మెడికల్‌, పీజీ డెంటల్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, హోమియోపతి పీజీ, బీఎన్‌వైఎస్‌, జీఎన్‌ఎంసీ, ఎంపీహెచ్‌, డీఎంఎల్‌టీ, ఇతర పారామెడికల్‌ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్‌, పీబీ బీఎస్సీ (నర్సింగ్‌-రెండేళ్లు), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీపీటీ, ఎంపీటీ కోర్సులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు 2023-24 విద్యాసంవత్సరం నుంచి 2025-26 వరకు వరకు అమలులో ఉండేలా ఫీజుల నిర్ణయానికి సంబంధించి కళాశాలల ఆర్థిక వ్యవహారాల వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు టీఏఎఫ్‌ఆర్‌సీ సభ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలను అందించని విద్యాసంస్థలకు.. 2023-24 విద్యాసంవత్సరం ఫీజు వసూలు చేయడానికి అనుమతించబోమని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని