సంక్షిప్త వార్తలు (4)

రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది.

Updated : 08 May 2024 05:49 IST

నేటి నుంచి మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. గత సంవత్సరం చేపట్టిన పరిశోధన ఫలితాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పరిశోధనలపై ప్రణాళికల రూపకల్పన చేయనున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ, ఇథనాల్‌ ఉత్పత్తిలో నిర్దిష్ట లక్ష్య సాధనపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఆయా పరిశోధన శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొననున్నారు.


మెరుపు వెలుగులో నల్లరాతి అందాలు..

ఈదురు గాలులు.. ఉరుములు, మెరుపులతో మంగళవారం యాదాద్రి దివ్యక్షేత్రం ప్రత్యేకంగా కనిపించింది. ఆలయం గగనతలంలో భారీగా మెరుపులు మెరవడంతో ఆ వెలుగుల్లో నల్లరాతి కట్టడాలు భక్తులకు కనువిందు చేశాయి.

న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట పట్టణం


‘చర్ల’ కేసులో ఎన్‌ఐఏ అభియోగపత్రం

ఈనాడు, హైదరాబాద్‌: చర్ల డ్రోన్లు, పేలుడు పదార్థాల జప్తు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ముగ్గురు నిందితులపై మంగళవారం నాంపల్లి న్యాయస్థానంలో మొదటి అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది. మావోయిస్టు సభ్యురాలు కమలతోపాటు పరారీలో ఉన్న మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, బడే చొక్కారావుపై అభియోగాలు మోపింది. గతేడాది ఆగస్టులో కమలతోపాటు మరికొందరు మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీకి అవసరమైన పరికరాలను సరఫరా చేస్తుండగా పట్టుకున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది డిసెంబరులో 8 మందిపై అభియోగపత్రం దాఖలు చేసింది.


శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేందర్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు