IT Jobs: జర్మనీలో ఐటీ ఉద్యోగాలు.. అప్లై చేయండిలా..

జర్మనీ దేశంలో ఐటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాంకాం(తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ) సంస్థ జనరల్‌ మేనేజర్‌ నాగభారతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 21 May 2023 07:54 IST

కార్వాన్‌, న్యూస్‌టుడే: జర్మనీ దేశంలో ఐటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాంకాం(తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ) సంస్థ జనరల్‌ మేనేజర్‌ నాగభారతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్లు, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, డేటా ఇంజినీర్లు తదితర ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు వివరించారు. అభ్యర్థులు డిగ్రీ కంప్యూటర్స్‌, బీటెక్‌, బీఈ, ఎంసీఏ, డిప్లొమా అర్హతలతోపాటు సంబంధిత రంగంలో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలన్నారు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మరిన్ని వివరాలకు విజయనగర్‌కాలనీలోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న టాంకాం కార్యాలయంలో లేదా 78935 66493, 98496 39539 చరవాణి నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు