సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్‌ ఆలయం

ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే అధునాతన ఆలయం తెలంగాణలోని సిద్దిపేట శివారులో నిర్మితమవుతోంది.

Published : 02 Jun 2023 04:12 IST

రోబో సాయంతో నిర్మాణం..

ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే అధునాతన ఆలయం తెలంగాణలోని సిద్దిపేట శివారులో నిర్మితమవుతోంది. త్రీడీ ప్రింటింగ్‌.. రోబో సాయంతో పనులు చేపట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన అప్సుజా ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ ఆధ్వర్యంలో.. సిద్దిపేట అర్బన్‌ మండలం బూరుగుపల్లిలో నిర్మిస్తున్న ఓ టౌన్‌షిప్‌ ఆవరణలో ఈ ఆలయం రూపుదాలుస్తోంది. 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో రోబో సాయంతో ఈ ఆలయాన్ని 3 భాగాలుగా నిర్మిస్తున్నారు. ఆలయంలో గణేశుడు, శివుడు, పార్వతిదేవి గర్భగుడులు ఉంటాయి. ‘సింప్లిఫోర్స్‌ క్రియేషన్స్‌’ సంస్థ భాగస్వామ్యంతో పనులు చేపట్టారు. ముందుగా సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేస్తే రోబోనే పనులు చేపడుతుంది. ఇప్పటికే గణేశ్‌, శివాలయాలు పూర్తయ్యాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్‌తో నిర్మాణం చేపట్టారు. సాంకేతికతతో భారీస్థాయిలో ఆలయం నిర్మించడం ఇక్కడే మొదటిసారని.. ఇది ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటింగ్‌ ఆలయమని కంపెనీ ఎండీ జీడిపల్లి హరికృష్ణ తెలిపారు.

న్యూస్‌టుడే, సిద్దిపేట

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు