Viral: గురి తప్పింది.. బావిలో పడింది!

ఈ మధ్య కాలంలో జంతువులు తరచుగా జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. వీధుల్లో సంచరిస్తూ ప్రజలను

Published : 02 Jul 2021 23:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య కాలంలో జంతువులు తరచుగా జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. వీధుల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పెంపుడు జంతువులను పొట్టన బెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ జంతువులు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్‌లో చోటుచేసుకుంది. ఊళ్లోకి వచ్చిన ఒక పులి ఓ కుక్కను వేటాడేందుకు ప్రయత్నించింది. దాన్ని వేటాడే క్రమంలో పొలాల్లో ఉన్న బావిలో పడిపోయింది. శునకాల అరుపులతో చిరుతను గుర్తించిన పొలం యజమాని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతను రక్షించారు. కాగా చిరుతను బోనులో బంధిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని