China: జిన్‌పింగ్ కేబినెట్‌లో మరో మంత్రి మిస్సింగ్..?

షీ జిన్‌పింగ్(Xi Jinping) ప్రభుత్వంలో మరో మంత్రి మిస్‌ అయ్యారు. రెండు వారాలుగా రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్ఫూ(Li Shangfu) బహిరంగ కార్యకలాపాల్లో కనిపించడం లేదు. 

Updated : 11 Sep 2023 16:38 IST

బీజింగ్: చైనా(China) ప్రభుత్వం తనను ధిక్కరించిన వారిని కఠినంగా అణివేస్తుందనడానికి అలీబాబా(Alibaba) గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా (Jack Ma) అదృశ్యమే ఒక ఉదాహరణ. ఆయన కొన్ని నెలలపాటు కనిపించకుండా పోయారు. కానీ ఇప్పుడు జిన్‌పింగ్(Xi Jinping) సొంత ప్రభుత్వంలోనే మంత్రులే కనిపించకుండా పోతున్నారు. మొన్నటికిమొన్న విదేశాంగ మంత్రి హోదాలో ఉండగానే చిన్‌గాంగ్ అదృశ్యమయ్యారు. ఆయన జాడ ఇప్పటికీ లేదు. తాజాగా రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్ఫు(Li Shangfu) ఎక్కడికి వెళ్లిపోయారో స్పష్టత లేదు. రెండు వారాల క్రితం బీజింగ్‌లో జరిగిన చైనా-ఆఫ్రికా పీస్‌ అండ్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడిన తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించలేదు.

షాంగ్ఫు అదృశ్యంపై ఇటీవల జపాన్‌లోని అమెరికా రాయబారి అనుమానం వ్యక్తం చేశారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఆయన మిస్సింగ్‌పై వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చిన్‌గాంగ్‌ కనిపించకుండా పోగా.. ఆ తర్వాత పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు కమాండర్ల జాడ లేదు. ఈ రాకెట్ ఫోర్స్‌.. అణు, బాలిస్టిక్‌ క్షిపణుల ఆయుధాగారాన్ని పర్యవేక్షిస్తుంది.

Kim-Putin meet: విలాసవంతమైన రైల్లో.. రష్యాకు బయలుదేరిన కిమ్‌?

ఇదిలా ఉంటే.. హార్డ్‌వేర్ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుపుతోన్న సమయంలో ప్రస్తుత పరిణామం చోటుచేసుకుంది. అయితే ఈ కేసులపై 2017 నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు చైనా మిలిటరీ వెల్లడించింది. 2017 నుంచి 2022 మధ్య షాంగ్ఫు ఎక్విప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కార్యకలాపాలు చూశారు. అయితే ఆ సమయంలో ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా వినిపించలేదని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని