China Economy : చైనా ఆర్థిక వ్యవస్థ డీలా.. అంగీకరించిన ముఖ్య నేతలు

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (Economy) పేరొందిన చైనా (China) కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిపై ఆ దేశ ముఖ్య నేతలు సమీక్ష నిర్వహించారు. 

Published : 24 Jul 2023 17:57 IST

బీజింగ్‌ :  కొవిడ్‌ అధ్యాయం ముగిసిన తరువాత నుంచి చైనా (China) ఆర్థిక వ్యవస్థ (Economy) ‘నూతన సవాళ్లు, ఇబ్బందులు’ ఎదుర్కొంటోందని ఆ దేశ అగ్రనాయకులు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ‘24 పర్సన్‌ పొలిట్‌ బ్యూరో’లో ఈ అభిప్రాయం వ్యక్తమైనట్లు ఆ దేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఏటా జులై నెల చివర్లో నేతలు ఇలా సమావేశమవుతారు. ఆగస్టులో వచ్చే సంప్రదాయ వేసవి విరామానికి ముందు దేశ ఆర్థిక పరిస్థితిని వారు సమీక్షిస్తారు.

మద్యం తాగి కారు నడిపిన మహిళా మంత్రి గారు.. ఆపై రాజీనామా..!

‘దేశంలో జరుగుతున్న ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలు కొత్త ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కొంటున్న అంశాన్ని ఈ సమావేశం ఎత్తి చూపింది. ముఖ్యంగా దేశీయ డిమాండ్‌ తగ్గింది. దాంతో కొన్ని సంస్థల కార్యాచరణకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. కీలక ప్రాంతాల్లో అధిక నష్టాలు, కనపడని ముప్పు పొంచి ఉంది. బాహ్య వాతావరణం సైతం ఆశాజనకంగా లేదని’ ఓ చైనా మీడియా సంస్థ పేర్కొంది.

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనాలో కొవిడ్‌ మహమ్మారి అధ్యాయం ముగిసిన తరువాత నుంచి మునుపటి దూకుడు కనిపించడం లేదు. గత కొద్ది నెలలుగా వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పొలిట్‌ బ్యూరో సైతం అంగీకరించింది. అందుకే కచ్చితమైన, సమర్థవంతమైన స్థూల ఆర్థిక నియంత్రణను అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో దేశీయ వినియోగాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నాలు చేయాలని నేతలు పిలుపునిచ్చారు. స్థిరాస్తి విధానాలను సమయానుకూలంగా సర్దుబాటు చేయాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని