Maldives: భారత్‌ నమ్మకమైన మిత్రదేశం.. మనకు ‘911 కాల్‌’ వంటిది: మాల్దీవుల మాజీ మంత్రి

భారత్‌ మిత్రదేశమని, ఎల్లప్పుడూ సాయం చేస్తుందని మాల్దీవుల(Maldives) రక్షణ శాఖ మాజీ మంత్రి మరియా అహ్మద్‌ అన్నారు. 

Updated : 11 Jan 2024 13:50 IST

మాలె: భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల(Maldives) మంత్రులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వారిపై స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మాల్దీవుల రక్షణ శాఖ మాజీ మంత్రి మరియా అహ్మద్ దీదీ స్పందిస్తూ.. భారత్‌ తమకు ఎంత ముఖ్యమో చెప్పారు. అది ఆపత్కాలంలో ఆదుకునే ‘911 కాల్‌’ వంటిదన్నారు. ‘ప్రస్తుత ప్రభుత్వంలో దూరదృష్టి లోపించింది. అందరితో స్నేహంగా ఉండే చిన్నదేశం మనది. అదే సమయంలో భారత్‌ పొరుగు దేశమన్న విషయాన్ని మరవకూడదు. రెండు దేశాలకు ఒకేరకమైన సవాళ్లున్నాయి. భారత్ ఎల్లప్పుడూ మనకు సాయం చేస్తుంది. ఇతర రంగాలతో పాటు రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సహకరిస్తోంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ఇరు దేశాలది ఒకే వైఖరి. ఇలాంటి చిరకాల మైత్రిని దెబ్బతీసే ఏ ప్రయత్నమూ సరికాదు. భారత్‌ మనకు 911 కాల్‌ (అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం కోసం కాల్‌ చేసే నంబర్‌. పలు దేశాల్లో ఈ సేవను ఉపయోగిస్తున్నారు)వంటిది’ అని భారత్‌తో ఉన్న బంధాన్ని గుర్తుచేశారు.

మరింత దిద్దుబాటలో మాల్దీవులు

మాల్దీవుల(Maldives) ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు భారత్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు దిగిపోవాలని డిమాండ్‌లు జోరందుకున్నాయి. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పార్లమెంటరీ మైనార్టీ లీడర్‌ అలీ అజీం పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని