జడ్జి పదవి కోసం మరోసారి అరుణ్‌ సుబ్రమణియన్‌ పేరు

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ భారతీయ-అమెరికన్‌ న్యాయవాది అరుణ్‌ సుబ్రమణియన్‌ను న్యూయార్క్‌లోని దక్షిణ జిల్లా(సదరన్‌ డిస్ట్రిక్ట్‌) కోర్టు న్యాయమూర్తి పదవికి మరోసారి నామినేట్‌ చేశారు.

Published : 26 Jan 2023 05:06 IST

మళ్లీ నామినేట్‌ చేసిన బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ భారతీయ-అమెరికన్‌ న్యాయవాది అరుణ్‌ సుబ్రమణియన్‌ను న్యూయార్క్‌లోని దక్షిణ జిల్లా(సదరన్‌ డిస్ట్రిక్ట్‌) కోర్టు న్యాయమూర్తి పదవికి మరోసారి నామినేట్‌ చేశారు. ఈ మేరకు శ్వేతసౌధం నుంచి సెనెట్‌కు అధికారిక సమాచారం అందింది. గత సెప్టెంబరులో అరుణ్‌ సుబ్రమణియన్‌ను బైడెన్‌ తొలిసారి నామినేట్‌ చేశారు. అరుణ్‌ నియామక నిర్ధారణ కోసం సెనెట్‌ జ్యుడిషియరీ కమిటీ డిసెంబరు 13న సమావేశం నిర్వహించింది. అయితే కాంగ్రెస్‌ దాన్ని ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో బైడెన్‌ మరోసారి ఆయన్ను నామినేట్‌ చేశారు. ఈసారి ఆయన నియామకం ఖరారు అయితే ఈ పదవిని అలంకరించే తొలి దక్షిణాసియా వ్యక్తిగా నిలవనున్నారు. 1979లో పిట్స్‌బర్గ్‌లో జన్మించిన అరుణ్‌ న్యాయవాదిగా విశేష సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని