అమెరికాలో భారతీయులపై కుట్ర, మోసం కేసు

దంతవైద్యం, దానికి సంబంధించిన వ్యాపారాల్లో అంతర్రాష్ట్ర స్థాయిలో ఒక భారీ కుట్ర చేశారంటూ తొమ్మిది మంది భారతీయ అమెరికన్లు, భారతీయులు సహా మొత్తం 12 మందిపై పెన్సిల్వేనియాలో కేసు నమోదైంది.

Published : 27 Jan 2023 05:04 IST

దంతవైద్య కంపెనీ పేరుతో పన్ను ఎగవేత

వాషింగ్టన్‌: దంతవైద్యం, దానికి సంబంధించిన వ్యాపారాల్లో అంతర్రాష్ట్ర స్థాయిలో ఒక భారీ కుట్ర చేశారంటూ తొమ్మిది మంది భారతీయ అమెరికన్లు, భారతీయులు సహా మొత్తం 12 మందిపై పెన్సిల్వేనియాలో కేసు నమోదైంది. సవానీ గ్రూప్‌ కంపెనీలతో ఈ 12 మంది వ్యక్తులు కలిసి వీసా మోసాలు, చికిత్సలకు సంబంధించిన మోసాలు, పన్ను ఎగవేత, నగదు అక్రమ చలామణి వంటివాటికి పాల్పడ్డారని కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. వారిలో ఆరుగురు సవానీ గ్రూపులో పనిచేస్తున్నారు. ఈ గ్రూప్‌నకు చెందిన భాస్కర్‌ సవానీ (57), నిరంజన్‌ సవానీ (51) ఇద్దరూ పెన్సిల్వేనియాలో లైసెన్సు ఉన్న దంతవైద్యులు. అరుణ్‌ సవానీ (55) ఈ గ్రూపు ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటారు. ఈ సోదరులు ముగ్గురూ విదేశీయులకు అమెరికా వర్క్‌ వీసాలు ఇప్పిస్తూ, అదే సమయంలో వారి అసలు ఉద్యోగాలు, బాధ్యతలను దాచిపెట్టారు. ఈ నెల 20న వీరు ముగ్గురూ కోర్టుకు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని