Chatgpt: ఒక్క ప్రశ్నతో నిమిషంలో రూ.17వేలు.. అంతా చాట్‌జీపీటీ చలవే..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దాని ఆధారంగా ఓపెన్‌ ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ.. ఆశ్చర్యపరిచే తన పనితనంతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది.

Published : 26 Apr 2023 07:30 IST

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దాని ఆధారంగా ఓపెన్‌ ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ.. ఆశ్చర్యపరిచే తన పనితనంతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది. అమెరికాకు చెందిన జోషువా బ్రౌడర్‌ అనే వ్యక్తి తనకు డబ్బులు కావాలి అని ఇటీవల చాట్‌జీపీటీని అడగ్గా.. అతడు క్లెయిమ్‌ చేసుకోని 210 డాలర్లు (దాదాపు రూ.17,000) రికవరీ చేసిపెట్టింది. ‘‘నా పేరు జోషువా బ్రౌడర్‌. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. నా పుట్టిన తేది 12/17/1996. నాకు కొంత డబ్బులు కావాలి?’’ అని ఆయన చాట్‌జీపీటీని అడిగారు. అనంతరం రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ.. అతడు ఇప్పటివరకు క్లెయిమ్‌ చేసుకోని ఆఫర్‌ను ఆన్‌లైన్‌లో వెతికిపెట్టింది. ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలో కూడా చెప్పింది. బ్రౌడర్‌ కూడా చాట్‌జీపీటీ చెప్పినట్లు చేశారు. అనంతరం నిమిషం వ్యవధిలోనే కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి 210 డాలర్లు తన బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, చాట్‌బాట్‌కు క్యాప్చా రీడ్‌ చేయడంలో ఇబ్బంది తలెత్తిందని, అది మినహాయిస్తే మిగతాదంతా.. అదే చేసిందని తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌పై ఓ నెటిజన్‌ స్పందింస్తూ.. ‘‘ఈ విషయాన్ని షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు! నేను కూడా చాట్‌జీపీటీని చెక్‌ చేశాను. నా పేరు మీద ఇప్పటివరకు క్లెయిమ్‌ చేయని 385 డాలర్లు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని