India-Canada: నిజ్జర్ హత్య.. కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలి: అమెరికా
India Canada diplomatic row: నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేలాలంటే దర్యాప్తు జరగాలని అమెరికా అభిప్రాయపడింది. ఈ దర్యాప్తును భారత్ సహకరించాలని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు ఈ వివాదానికి తెరలేపాయి. దీనిపై తాజాగా అమెరికా (USA) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిజ్జర్ హత్యపై కెనడా చేపట్టిన దర్యాప్తునకు భారత్ సహకరించాలని అమెరికా సూచించింది. (India Canada diplomatic row)
‘‘నిజ్జర్ హత్యతో భారత్ ఏజెంట్లకు సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టేందుకు ఒట్టావా చేస్తున్న ప్రయత్నాలకు మేం మద్దతిస్తున్నాం. పారదర్శకమైన, సమగ్ర దర్యాప్తుతోనే నిజానిజాలేంటో అందరికీ తెలుస్తాయని విశ్వసిస్తున్నాం. అందుకే, ఎలాంటి దర్యాప్తుకైనా భారత అధికారులు సహకరించాలని కోరుతున్నాం’’ అని శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కెర్బీ విలేకరులతో అన్నారు. అటు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు.
‘‘ఇలాంటి ఆరోపణలు (భారత్‌పై ట్రూడో వ్యాఖ్యలనుద్దేశిస్తూ) ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, క్రియాశీలకమైన నేర విచారణతోనే అసలు నేరస్థులకు శిక్ష పడుతుందని మేం భావిస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో ఎవరూ ఓ నిర్ధారణకు రాకముందే ఈ దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమత్వ విధివిధానాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అందుకే పారదర్శక దర్యాప్తు జరగడమే సబబు’’ అని గార్సెట్టీ వ్యాఖ్యానించారు.
కెనడాకు రాకపోకల్లో జాగ్రత్త సుమా: భారత్ అడ్వైజరీ
గత సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ పార్లమెంట్లో నిజ్జర్ హత్య గురించి మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన అతడిని తమ దేశ పౌరుడిగా ట్రూడో పేర్కొనడం కూడా తీవ్ర దుమారం రేపింది. అంతేగాక, కెనడాలో మన దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్.. మన దేశంలోని కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది. అంతేగాక, కెనడాలో పెరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులు, ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్లబోతున్నవారు అప్రమత్తంగా ఉండాలని భారత్ అడ్వైజరీ జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. -
ఇక హెచ్-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. -
పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం
సంప్రదాయ ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. -
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కాప్ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్
గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. -
అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వెంటనే అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కోరారు. -
ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ
క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. -
ఎన్నికల ముందు షరీఫ్‌కు ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (73)ను ఏవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. -
నేపాల్‌లో తొలి స్వలింగ వివాహ నమోదు
నేపాల్‌లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్‌జంగ్ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్‌జెండర్ మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. -
81కి చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం
ఉక్రెయిన్ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్ భార్య మరియా బుడనోవ్‌పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?