Maldives Row: మాల్దీవుల అధికారులతో భారత హైకమిషనర్‌ భేటీ

మాల్దీవుల్లోని(Maldives) భారత హైకమిషనర్‌ ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. 

Updated : 11 Jan 2024 14:02 IST

మాలే: ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన నేపథ్యంలో మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో మాల్దీవుల (Maldives) విదేశాంగ శాఖలోని రాయబారితో భారత హైకమిషనర్ మును మహావర్ భేటీ అయ్యారు. మనదేశంలోని మాల్దీవుల రాయబారికి కేంద్రం సమన్లు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాల మధ్య మాలేలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు ఇది కొద్దిరోజుల క్రితమే నిర్ణయించిన సమావేశమని తెలిపింది.

ఇదిలా ఉండగా.. మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో భారతీయుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. మనదేశంలోని మాల్దీవుల హైకమిషనర్‌ ఇబ్రహీం షాహీబ్‌కు సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం ఆయన మన విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి వచ్చారు. ఇది జరిగిన కొద్ది గంటలకే మాలేలోని అధికారులతో భారత హైకమిషనర్‌ భేటీ కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని