Israel: సిరియాపై ఇజ్రాయెల్‌ దాడి.. ఇరాన్‌ ఆర్మీ సలహాదారు మృతి!

సిరియాపై ఇజ్రాయెల్‌ సోమవారం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఆర్మీ సలహాదారు రజీ మౌస్సావీ మృతి చెందారు. అతడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది.

Updated : 26 Dec 2023 01:27 IST

తెహ్రాన్‌: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. సిరియా (Syria) లోని జీనాబియన్‌ జిల్లా డమాకస్‌ నగరం సమీపంలో ఇజ్రాయెల్‌  (Israel) జరిపిన వైమానిక దాడిలో ఇరాన్‌ (Iran)కి చెందిన ఆర్మీ సలహాదారు రజీ మౌస్సావీ (Razi Moussavi) మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ‘ఇస్లామిక్‌ రివెల్యుషనరీ గార్డ్‌ కార్ప్స్‌లో ఒక భాగమైన ‘కుద్స్‌ ఫోర్స్‌’కు ఎంతో అనుభవమున్న సలహాదారుగా రజీ వ్యవహరిస్తున్నారని ఇరాన్‌ మీడియా వెల్లడించింది. రజీ మృతి పట్ల ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేరానికి పాల్పడిన ఇజ్రాయెల్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. హమాస్‌కు, ఇతర తీవ్రవాద సంస్థలకు ఇరాన్‌ ఆర్థిక, సైనిక సాయం చేస్తోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే రజీ హెజ్‌బొల్లాకు సాయపడుతున్నాడని భావించి అతడి లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ఇంకా స్పందించలేదు. అయితే, హమాస్‌తో జరిగే పోరాటంలో ఇతర దేశాలు తలదూర్చొద్దని, పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే పరిస్థితులు తీసుకురావొద్దని చెబుతూ వస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని