Kim: కిమ్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ చూశారా..! వైరల్‌గా మారిన దృశ్యాలు

కిమ్(Kim) రాజ్యంలో అన్నీ వింతలే. తాజాగా వైరల్‌ అవుతోన్న వీడియో చూస్తే.. ఆ మాట నిజమనిపించకమానదు. 

Published : 14 Dec 2023 18:06 IST

ప్యాంగ్యాంగ్‌: ఉత్తరకొరియా(North Korea) పాలకుడు కిమ్ జోంగ్(Kim jong un) ఉన్‌ విధించే శిక్షలు, విధించే ఆంక్షలతో ప్రపంచం ఎప్పుడూ నివ్వెరపోతూనే ఉంటుంది. ఆయన వద్దకు రావాలంటే ఎన్నో కఠిన నిబంధలు ఉంటాయి. కానీ తాజాగా వైరల్ అవుతోన్న కిమ్ వీడియో చూస్తే ఆశ్చర్యం కలగమానదు. అంత కఠినంగా ఉండే ఆయన.. ఇంత సరదాగా ఎలా మారిపోయారనే డౌట్‌ వస్తుంది.

ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తుండటంతో ఇటీవల దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వీడియో అప్పుడు తీసిందేనని తెలుస్తోంది. ఆ కార్యక్రమంలో కిమ్ సరదాగా కనిపించారు. అక్కడున్న యువతులు, మహిళలకు కిమ్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో  వారంతా ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టారు. తెలుపురంగు దుస్తుల్లో ఉన్నవారంతా ఆయన చుట్టూ చేరి, సంతోషంగా స్టెప్పులు వేశారు. మరికొందరు ఉద్వేగాన్ని ఆపుకోలేక.. బిగ్గరగా ఏడ్చేశారు. ఆయన పక్కన నిల్చొని ఫొటోలకు పోజులు ఇచ్చారు.ఇప్పుడు ఈ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆకస్మికంగా జరిగింది కాదని, రిహార్సల్‌ వల్లే ఆడవారంతా ఒకేరకంగా స్టెప్పులు వేశారని కామెంట్ చేశారు. కిమ్ ఎత్తు గురించి అనుమానాలు వ్యక్తం చేశారు.

గాజాలో వేలల్లో మరణాలు.. ఆ ‘డంబ్‌ బాంబ్స్‌’ కారణమా..?

ఇటీవల కిమ్ కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  తల్లుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్ మాట్లాడుతూ..‘‘జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత. ఇందుకోసం మా ప్రభుత్వం తల్లులతో కలిసి పనిచేయాలని కోరుకుంటోంది’’ అని తెలిపారు. దేశంలోని తల్లులంతా మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతూ కిమ్‌(Kim) కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగం వినగానే సభలో మహిళలు కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రసంగం మధ్యలో కిమ్‌ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని