viral news: వాలెంటైన్స్‌ డే.. భర్త టాటూ చూసి భార్య షాక్‌!

ప్రేమికుల దినోత్సవం రోజున భర్త చేసిన ఓ పనికి భార్య షాక్‌ అయింది. థాయిలాండ్‌లో ఓ వ్యక్తి తన భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు తన చేతిపై మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను టాటూగా వేయించుకున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.

Published : 16 Feb 2023 18:30 IST

బ్యాంకాక్‌‌: ప్రేమించే వ్యక్తులను సర్‌ప్రైజ్‌ చేసేందుకు కొందరు రకరకాల పద్ధతులు అనుసరిస్తుంటారు. వాలెంటైన్స్‌ డే(Valentine's Day) వంటి ప్రత్యేక సందర్భాల్లో అయితే తమ ప్రియురాలు/జీవిత భాగస్వామి పట్ల వినూత్నంగా తమ ప్రేమను ప్రకటించి ప్రత్యేకంగా నిలుస్తుంటారు. తాజాగా థాయిలాండ్‌లో అలాంటి తరహా ఘటనలో ఒకటి వెలుగుచూసింది. ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి తన భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఏకంగా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌నే టాటూ(Marriage certificate tattoo)లా వేయించుకొని ఆశ్చర్యపరిచాడు. థాయిలాండ్‌కు చెందిన వాల్‌ అనే వ్యక్తి తన చేతిపై వేయించుకున్న టాటూ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెంట్రల్‌ థాయిలాండ్‌(Tahiland)లోని సరాబురి ప్రావెన్స్‌లో  కెంగ్ ఖోయ్‌లోని టాటూ స్టూడియోలో ఎనిమిది గంటలు కుర్చీలో కూర్చొని చేతిపై తమ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని టాటూలా వేయించుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, తొలుత ఆ టాటూను చూసి అతడి భార్య షాక్‌ అయినప్పటికీ.. ఆ తర్వాత తన పట్ల ప్రేమ, గౌరవానికి రుజువుగా ఉన్న ఆ టాటూను అంగీకరించారట. దీనిపై టాటూ వేసిన ఆర్టిస్ట్‌ మాట్లాడుతూ.. ఇంతకుముందు ఎన్నడూ తాను మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను ఇలా టాటూగా వేయలేదని చెప్పాడు. గతంలో ఓ వ్యక్తి తన భార్య పుట్టిన రోజు సందర్భంగా సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఆమె ముఖచిత్రాన్ని టాటూలా వేయించుకున్న వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని