North Korea: అబ్బే శతఘ్ని గుండ్లు కాదు.. మేమే శబ్దాలు సృష్టించాం: కిమ్‌ సోదరి

తాము దక్షిణ కొరియా వైపు అసలు కాల్పులే జరపలేదని.. వాటిని పోలిన శబ్దాలను సృష్టించినట్లు ఉత్తర కొరియా చెబుతోంది. తమ దళాలను కవ్విస్తే ప్రతి స్పందన తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.

Updated : 07 Jan 2024 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్: తమ దేశంపై ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా.. సైన్యం తక్షణమే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తుందని ఉత్తర కొరియా(North Korea) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్ సోదరి కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఆదివారం ఆ దేశ న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ పేర్కొంది. తమ దేశం దిశగా 60 శతఘ్ని గుండ్లను శనివారం ఉ.కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. దీనిపై యో జోంగ్‌ స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.

డెయిఫ్‌ ఫొటో సాధించాం.. ఉత్తరగాజాలో హమాస్‌ కమాండ్‌ వ్యవస్థను ధ్వంసం చేశాం: ఇజ్రాయెల్‌

‘‘మరోసారి స్పష్టం చేయదల్చుకొన్నాను. మా సైన్యం ట్రిగ్గర్‌ను ఇప్పటికే అన్‌లాక్‌ చేశాం. చిన్న కవ్వింపు చర్య ఎదురైనా వారు తక్షణమే భారీ స్థాయిలో ప్రతిస్పందిస్తారు. మా సైనికులు సముద్రంలోకి ఒక్క షెల్‌ను కూడా ప్రయోగించలేదు. గన్‌ఫైర్‌ను అనుకరించేలా పేలుళ్లను జరిపారు. ఆ తర్వాత మేము ఊహించినట్లే సియోల్‌ స్పందించింది. శతఘ్ని పేలుళ్లంటూ వారు అబద్ధాన్ని సృష్టించారు. భవిష్యత్తులో ఉత్తర తీరంలో పిడుగులు పడినా.. అది మా సైన్యం పేల్చిన శతఘ్ని గుండు అని చెబుతారు’’ అని యో జోంగ్‌ వెల్లడించారు.

ఆదివారం కూడా సరిహద్దుల్లో ఉత్తరకొరియా లైవ్‌ఫైర్‌ డ్రిల్స్‌ నిర్వహించింది. ఇవి పశ్చిమ సముద్ర తీరంలో జరిగినట్లు యాంహాప్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించినట్లు తెలిపింది. శుక్రవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శనివారం ఉత్తర కొరియా 200 రౌండ్ల శతఘ్ని గుండ్లను పేలిస్తే.. దక్షిణ కొరియా 400 రౌండ్లతో సమాధానం చెప్పింది.  ప్యాంగ్యాంగ్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. ఉ.కొరియా సరిహద్దుకు సమీపంలోని ద్వీపాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని