Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
పాకిస్థాన్(Pakistan) ప్రభుత్వం వికీపీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని వికీమీడియా కోరింది. దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan) తన దేశంలో వికీపీడియా(Wikipedia) సేవలను బ్లాక్ చేసింది. ప్రభుత్వం చట్టవిరుద్ధంగా భావించిన సమాచారాన్ని తొలగించడంలో వికీ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ఫ్రీ ఎన్‌సైక్లోపీడియాను నిర్వహించే వికీ మీడియా దీనిపై స్పందించింది. సేవలను మరలా పునరుద్ధరించాలని అభ్యర్థించింది.
మీడియా కథనాల ప్రకారం.. మత విరుద్ధమైన సమాచారాన్ని తొలగించాలని పాకిస్థాన్ టెలికాం అథారిటీ(PTA) ఇదివరకే వికీపీడియాను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వికీ యాక్సెస్ చేసుకునే వేగాన్ని తగ్గించింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసు ప్రకారం.. చట్టవిరుద్ధమైన సమాచారాన్ని తొలగించడంలో ఈ సంస్థ విఫలమైంది. దాంతో పీటీఏ దానిని బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని పీటీఏ ప్రతినిధి ధ్రువీకరించారు. దీనిపై వికీమీడియా ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ ప్రభుత్వం వికీపీడియా, వికీమీడియా ప్రాజెక్టులను బ్లాక్ చేసిందని తెలిపింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని అందులో కోరింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు కావాల్సిన సమాచారం కోసం వికీపీడియా సేవల్ని వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త టోల్ఛార్జీలు
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!