viral news: విమానం నడుపుతూ నిద్రలోకి జారుకొని..

విమానం నడుపుతూ కాక్‌పీట్‌లోనే నిద్రలోకి జారుకొన్న ఓ పైలట్‌ను ఇటలీకి చెందిన ఓ విమానయాన సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. న్యూయార్క్‌ నుంచి రోమ్‌కు వెళుతున్న ఐటీఏ ఎయిర్‌లైన్స్‌కు

Published : 30 May 2022 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విమానం నడుపుతూ కాక్‌పీట్‌లోనే నిద్రలోకి జారుకొన్న ఓ పైలట్‌ను ఇటలీకి చెందిన ఓ విమానయాన సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. న్యూయార్క్‌ నుంచి రోమ్‌కు వెళుతున్న ఐటీఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏజెడ్‌609 విమానంలో ఈ ఘటన చోటు చేసుకొంది. పైలట్‌ నిర్వాకం కారణంగా విమానం నుంచి 10 నిమిషాలపాటు ఎటువంటి కమ్యూనికేషన్‌ జరగలేదు. ఆ పైలట్‌ నిర్వాకం కారణంగా ఫ్రాన్స్‌ అధికారులు ఉగ్రదాడి అలెర్ట్‌ను ప్రకటించాల్సి వచ్చింది.  
మరోపక్క పైలట్‌ మాత్రం విమానంలో కీలక వ్యవస్థలు పనిచేయకపోవడంతో కమ్యూనికేషన్‌ సాధ్యం కాలేదని పై అధికారులకు వివరించాడు. కానీ, ప్రాథమిక దర్యాప్తు తర్వాత అతడు అబద్ధం చెప్పినట్లు తేలింది. 

ఏజెడ్‌609 ఎయిర్‌బస్‌ విమానాన్ని ఆటోపైలట్‌లో పెట్టి కోపైలట్‌ కూడా నిద్రలోకి జారుకోవడంతో  కొంత సేపు కమ్యూనికేషన్‌ సాధ్యంకాలేదు. దీంతో గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్‌లో ఆందోళన వ్యక్తమైంది. ఒక దశలో రెండు ఫ్రెంచి జెట్‌ విమానాలు కూడా వీటిపై నిఘాకు పంపించారు. విమానం ఆటోపైలట్‌ మోడ్‌లో ఉండటంతో సురక్షితంగా ప్రయాణించినట్లు ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని