Colombia: బుల్‌ఫైట్‌ జరుగుతుండగా స్టేడియం గ్యాలరీ కూలి..

బుల్‌ఫైట్‌ జరుగుతుండగా స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలి నలుగురు మృతి చెందిన ఘటన కొలంబియాలోని ఎల్‌ ఎస్పినల్‌లో చోటు చేసుకొంది.  ఈ ప్రమాదంలో 300 మందికి గాయపడ్డారు. ఎల్‌ ఎస్పినల్‌లో సంప్రదాయ

Updated : 27 Jun 2022 18:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బుల్‌ఫైట్‌ జరుగుతుండగా స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలి నలుగురు మృతి చెందిన ఘటన కొలంబియాలోని ఎల్‌ ఎస్పినల్‌లో చోటు చేసుకొంది.  ఈ ప్రమాదంలో 300 మందికి గాయపడ్డారు. ఎల్‌ ఎస్పినల్‌లో సంప్రదాయ కొర్రలెజ క్రీడను నిర్వహించారు. దీనిలో పాల్గొనేవారు ఒక దున్నపోతును కవ్విస్తూ  ఆడతారు. క్రీడ జరుగుతున్న సమయంలో ఒక్కసారి స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలిపోయింది. ఓ పక్క శిథిలాల నుంచి ప్రజలు బయటకు వస్తుండగా.. స్టేడియంలో క్రీడను మాత్రం కొనసాగించారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది.  సాన్‌ పెడ్రో అనే పండుగలో భాగంగా ఈ క్రీడను నిర్వహించారు. 

ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి మృతి చెందినట్టు టొలిమా గవర్నర్‌ జోస్‌ రిచర్డ్‌ ఓర్జ్‌కో పేర్కొన్నారు. గాయాలతో 322 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో కూడా నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.  ఈ క్రీడ కారణంగా తరచూ మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల మొదట్లో కూడా దున్నపోతు దాడిచేయడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మనుషులు, పశువులు ప్రాణాలు కోల్పోయే క్రీడలను అనుమతించ వద్దని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన గుస్తోవ్‌ పెట్రో స్థానిక అధికారులను ఆదేశించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని