Taiwan: భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించిన తైవాన్‌

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. తాజా తైవాన్‌ భారీ యుద్ధ విన్యాసాలను చేపట్టింది. వారం పాటు ఈ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. శత్రువు తైవాన్‌ రాజధాని తైపేకు

Published : 29 Jul 2022 02:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. తాజాగా తైవాన్‌ భారీ యుద్ధ విన్యాసాలను చేపట్టింది. వారం పాటు ఇవి జరగనున్నాయి. శత్రువు తైవాన్‌ రాజధాని తైపేకు వచ్చే జలమార్గాన్ని  స్వాధీనం చేసుకొంటే ఏమి చేయాలా అనే అంశంపై కూడా సాధన జరిగింది. ఈ క్రమంలో శత్రుసేనలు సముద్ర, వాయు మార్గాల్లో తమ్సు నదిపై పట్టసాధిస్తే ఏమిచేయాలనే అంశంపై సేనలు కసరత్తు చేశాయి. 

మరోవైపు అమెరికా హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటించనున్నారనే  ప్రచారం జరుగుతుండటం.. దీనికి చైనా సైన్యం స్పందించి హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. హాన్‌కుయాంగ్‌ పేరిట నిర్వహించే ఈ యుద్ధ విన్యాసాలకు చాలా ప్రాధాన్యం ఉంది. చైనా, తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవి చోటు చేసుకొన్నాయి. తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌ వెన్‌ మంగళవారం స్వయంగా ఈ యుద్ధ విన్యాసాలను పర్యవేక్షించారు. దాదాపు రెండు గంటలపాటు మిరాజ్‌-2000, ఎఫ్‌-16 యుద్ధవిమానాలు తూర్పువైపు నుంచి దాడి చేస్తుండగా వాటిని ఎదుర్కోవడానికి తైవాన్‌ సేనలు సాధన చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని