అమెజాన్‌ అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం

రెండు వేల సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి.. ఆ తర్వాత మరుగునపడిన ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్‌ అడవుల్లో బయటపడింది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్‌లో దీనిని గుర్తించినట్లు ‘ది జర్నల్‌ సైన్స్‌’ పత్రిక పేర్కొంది.

Published : 13 Jan 2024 05:27 IST

 

 ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు వేల సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి.. ఆ తర్వాత మరుగునపడిన ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్‌ అడవుల్లో బయటపడింది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్‌లో దీనిని గుర్తించినట్లు ‘ది జర్నల్‌ సైన్స్‌’ పత్రిక పేర్కొంది. 2015లో లేజర్‌ సాంకేతికతతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు. ఆ ఫలితాలను తాజాగా ప్రచురించారు. ఒకప్పుడు ఇక్కడ రోడ్లను ప్రణాళిక ప్రకారం నిర్మించినట్లు చెబుతున్నారు. క్రీస్తుపూర్వం 500 నుంచి క్రీస్తుశకం 300-600 వరకు ఉపానో ప్రజలు ఇక్కడ జీవించినట్లు భావిస్తున్నారు. స్థానిక మట్టి దిబ్బలపై 6 వేల ఇళ్లు, భవనాలు నిర్మించారని.. చుట్టూ వ్యవసాయ క్షేత్రాలుండేవని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు 33 అడుగుల వెడల్పుతో, దాదాపు 20 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు ఆధారాలున్నాయి. కనీసం 10 వేల నుంచి 30 వేల మంది ఇక్కడ నివసించేవారని ఆంటోనే డోరిసన్‌ అనే శాస్త్రవేత్త అంచనా వేశారు. ఇక్కడ మొత్తం ఐదు ప్రాంతాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇళ్లను చెక్కతో నిర్మించారని పేర్కొన్నారు. వీటిలో నిప్పు ఉంచడానికి ప్రత్యేక ప్రదేశాల్లో రంధ్రాలను గుర్తించారు. దాదాపు వెయ్యేళ్ల క్రితం ఈ నగరం అదృశ్యమైనట్లు భావిస్తున్నారు. కాగా ఇరవైఏళ్ల క్రితం ఇక్కడ మట్టిదిబ్బలు, పూడుకుపోయిన రోడ్లను స్టీఫెన్‌ రోస్టైన్‌ అనే శాస్త్రవేత్త గుర్తించారు. కాకపోతే అక్కడ నగరం ఉంటుందని ఊహించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని