Zelensky: ఆ నగరాన్ని ఆక్రమిస్తే.. ఇక రష్యాకు అడ్డులేనట్లే..!

ఏడాది కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా(Russia) దాడి చేస్తోంది. ఈ క్రమంలో బక్ముత్‌ నగరం వద్ద పోరాడుతోంది. దానిని స్వాధీనం చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. 

Updated : 25 Mar 2023 16:42 IST

కీవ్‌: బక్ముత్ నగరాన్ని ఆక్రమిస్తే.. తూర్పు ఉక్రెయిన్‌(Ukraine)లోని కీలక నగరాల్లో దూసుకెళ్లడానికి ఇక రష్యా(Russia)కు అడ్డు ఉండదని యూఎస్ మీడియా కథనం పేర్కొంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ( Volodymyr Zelensky)ని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 

‘బక్ముత్‌ తర్వాత రష్యా బలగాలు ఇతర ప్రాంతాల్లోకి దూసుకెళ్లగలవని మాకు అర్థమైంది. దొనెట్స్క్‌ దిశగా బక్ముత్‌ నుంచి ఇతర నగరాలకు చొచ్చుకొనిపోవడానికి వారికి సులువవుతుంది’ అని జెలెన్‌స్కీ(Zelensky అంచనా వేశారు. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతమైన బక్ముత్‌ను స్వాధీనం చేసుకోవాలని రష్యా ఆర్మీ గట్టిపట్టుతో ఉంది. ప్రస్తుతం ఈ నగరం పుతిన్‌ సేనల ముట్టడిలో ఉంది. రష్యాకు చెందిన ప్రైవేటు సైన్యం అత్యంత క్రూరమైన వ్యూహాలతో ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన బక్ముత్‌ వద్ద పోరాడుతోందని ఇదివరకు వార్తలు వచ్చాయి. దాంతో పెద్దసంఖ్యలో ప్రజలు వలస వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. 

‘ఇటీవల నేను భద్రతా బలగాల చీఫ్‌తో సమావేశమయ్యాను. బక్ముత్‌ వద్ద దృఢంగా నిలబడాల్సి ఉందని ఆ సమావేశంలో సైన్యం వెల్లడించింది. కానీ మేం మా సైనికులు ప్రాణాల గురించి ఆలోచించాలి. అలాగే ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలి. అక్కడి నుంచి రష్యా ఏం కోరుకుంటుందో మొదట అర్థం చేసుకోవాలి. రష్యా ఒక చిన్న విజయమైన సాధించాలని కోరుకుంటోంది. బక్ముత్‌లో అంతా  నాశనం చేసి, సామాన్య ప్రజలందరిని చంపేసి దానిని దక్కించుకోవాలనుకుంటోంది’ అని జెలెన్‌స్కీ(Volodymyr Zelensky) అన్నారు. రష్యా(Russia) ఏడాది కాలంగా ఉక్రెయిన్‌పై దాడి కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇరువర్గాల్లో ఎవరికీ విజయం దక్కే సూచనలు కనిపిచడం లేదు. ఈ క్రమంలో పుతిన్ సైన్యం నుంచి దాడులు మరింత తీవ్రం అవుతాయనే ఆందోళనలను వినిపిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని