AP News: జీపీఎస్‌ వద్దే వద్దు.. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పట్టు

సీపీఎస్‌ (CPS)ను రద్దు చేయమని అడుగుతుంటే ప్రభుత్వం జీపీఎస్‌ (GPS) తీసుకురావడం ఏంటని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులుఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీఎస్‌లోకి వెళ్లేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు (Teachers) ప్రభుత్వం ఆప్షన్ ఇస్తే ఎవరూ వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్‌ను మిగిలిన రాష్ట్రాల్లో రద్దు చేసినప్పుడు ఏపీలో ఎందుకు రద్దు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకుంటే మరోసారి చలో విజయవాడ చేపట్టేందుకూ సిద్ధమని హెచ్చరించారు.

Published : 08 Jun 2023 14:16 IST

మరిన్ని