Balakrishna: ప్రచారంలో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులు

తెదేపా ఆవిర్భవించాక ఓటమి ఎరుగని కంచుకోటగా పేరొందిన హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వరుస విజయాలతో నందమూరి బాలకృష్ణ సరికొత్త చరిత్ర సృష్టించారు. అదే స్థానం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. బాలయ్యతో మేము సైతం అంటూ ఆయన కుటుంబసభ్యులు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 

Published : 10 May 2024 19:36 IST

క్లాస్, మాస్ అనే తేడా లేదు. చిన్నా, పెద్దా, యువత అనే భేదం లేదు. ప్లేస్ ఏదైనా సెంటర్ ఎవరు డిసైడ్  చేసినా యావత్ తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించే  నినాదం ‘జై బాలయ్య’. ‘బావ బాగు కోరే బావమరిది’గా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు సినీ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. పార్టీ ఆవిర్భవించాక ఓటమి ఎరుగని కంచుకోటగా పేరొందిన హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వరుస విజయాలతో సరికొత్త చరిత్ర సృష్టించారు. అదే స్థానం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. బాలయ్యతో మేము సైతం అంటూ ఆయన కుటుంబసభ్యులు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. లోకేశ్‌, భరత్‌ల విజయాన్ని కాంక్షిస్తూ వసుంధరతో పాటు బ్రాహ్మణి, తేజస్వినిలు ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.

Tags :

మరిన్ని