Vijayawada: విజయవాడలో భారీ వర్షం

విజయవాడ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భానుడి భగభగలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది.

Published : 10 May 2024 17:15 IST

విజయవాడ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భానుడి భగభగలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో మురుగు కాలువలు నిండి రోడ్లపై ప్రవహించాయి. దీంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. బందరు రోడ్డు, ఏలూరు, ఆటోనగర్ రోడ్లపై వర్షం నీరు భారీగా చేరడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.

Tags :

మరిన్ని