BJP: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై భాజపా అగ్రనాయకత్వం గురి!

తెలంగాణలో అసెంబ్లీ పోరుకు సమయం దగ్గరపడుతుండటంతో.. భాజపా (BJP) జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది. మహా జన్‌సంపర్క్ అభియాన్‌లో భాగంగా అగ్రనేతలు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 15న ఖమ్మం ఎంపీ నియోజకవర్గ పరిధిలో అమిత్  షా (Amit Shah), 25న నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం పరిధిలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda).. సభలకు హాజరుకానున్నారు. నెలాఖరుకు ప్రధాని మోదీ (PM Modi) మల్కాజ్‌గిరిలో రోడ్ షోతో పాటు.. మరో ఎంపీ స్థానంలో బహిరంగ సభలో పాల్గొననున్నట్లు పార్టీ తెలిపింది. 

Updated : 07 Jun 2023 16:35 IST

మరిన్ని