Somu Veerraju: వైకాపా - భాజపా కలిసే ఉన్నాయనేది అపోహే: సోము వీర్రాజు

వైకాపా - భాజపా కలిసి ఉన్నాయనేది అపోహ మాత్రమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. తాను ప్రతిరోజూ వైకాపాను, సీఎం జగన్‌ను విమర్శిస్తూనే ఉన్నానన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి తగిన సహకారం లభించలేదని సోము వీర్రాజు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు.. జనసేన నుంచి అందిన సహకారం ఎంత అనేది మీరే ఆలోచించుకోవాలంటూ ఎదురు ప్రశ్నించారు.

Published : 22 Mar 2023 21:25 IST

మరిన్ని