Cyclone Michaung: కడపలో చెరువులను తలపిస్తున్న రహదారులు

మిగ్‌జాం తుఫాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల, కడప జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. బాపట్ల జిల్లా తోకలవానిపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం నీటి మునిగింది. గ్రామంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. కడప జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, కోర్టు రోడ్డు, అంబేద్కర్ కూడలి, వై జంక్షన్, భరత్ నగర్, భాగ్యనగర్ కాలనీ, మృత్యుంజయ కుంట, అక్కయపల్లి, రామరాజు పల్లి, లోహియా నగర్ తదితర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులోకి భారీగా వరద నీరు చేరింది. శ్రీకాళహస్తి, పాపారాయుడుపేట, గుడిమల్లం, పిచ్చాటూరు, వెంకటగిరి రహదారులపై వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Updated : 05 Dec 2023 14:51 IST

Tags :

మరిన్ని