Crime News: మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పని చేస్తున్న భూక్యా అశోక్.. ఓ మహిళను ప్రేమ వివాహం చేసుకొని, కోమటి బస్తీలో నివసిస్తున్నాడు. ప్రతి రోజు మద్యం సేవించి భార్యను కొడుతూ.. మత్తులో తాను చనిపోతానంటూ బెదిరిస్తుండేవాడు. సోమవారం కూడా మద్యం సేవించి భార్యను కొట్టాడు. ఆత్మహత్య చేసుకుంటానని ఇంటిలో నుంచి వెళ్లిన అశోక్‌.. మధ్యాహ్నం వేళ బాలానగర్  ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 06 Jun 2023 13:20 IST

మరిన్ని