మహిళ మెదడులో సజీవంగా కొండచిలువల్లోని పురుగు

వైద్య చరిత్రలో తొలిసారి ఓ మనిషి(మహిళ) మెదడులో సజీవంగా ఉన్న ఓ పురుగును వైద్యులు గుర్తించి బయటకు తీసిన ఘటన ఆస్ట్రేలియాలో (Australia) చోటుచేసుకుంది. గతేడాది జూన్‌లో జరిగిన ఈ విషయం ఎమర్జింగ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ అనే జర్నల్‌లో తాజాగా ప్రచురితం కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన శస్త్రచికిత్స చేసిన బృందంలో ఓ తెలుగు వ్యక్తి ఉండడం గమనార్హం. ఈ పురుగులు ఆస్ట్రేలియాలోని ఓ జాతి కొండచిలువ (కార్పెట్‌ పైథాన్‌)ల్లో నులి పురుగులుగా ఉంటాయని ఆ తర్వాత వైద్యులు తెలుసుకున్నారు.

Published : 30 Aug 2023 12:09 IST

Tags :

మరిన్ని