AP News: ‘యువగళం’ తర్వాత.. వైకాపాలో ఏ ఒక్కరూ గెలవరు: ప్రత్తిపాటి

వచ్చే ఎన్నికల్లో వైకాపా ఇంటికి వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) పేర్కొన్నారు. సీ-ఓటర్‌ ఇండియా టుడే సర్వేలో వైకాపా గ్రాఫ్‌ 39 శాతానికి పడిందని.. బుల్‌ డోజర్లు పెట్టి లేపినా వైకాపా లేచే పరిస్థితి లేదన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబేనని.. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. లోకేశ్‌ పాదయాత్ర (YuvaGalam) తర్వాత ఒక్క వైకాపా ఎమ్మెల్యే కూడా గెలవరని.. ఐప్యాక్‌ సర్వేలోనూ మంత్రులు ఇంటికెళ్లడం ఖాయమని తేలిందన్నారు.

Published : 29 Jan 2023 16:12 IST

మరిన్ని