AP News: మూన్నెళ్లుగా రేషన్‌ లేదు.. ఆకులు నములుతూ గిరిజనుల భిక్షాటన!

మూన్నెళ్లుగా తమకు కోటా బియ్యం, ఇతర సరుకులు ఇవ్వడం లేదని.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని గిరిజనులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆకులు నములుతూ, చేత్తో కంచాలు పట్టుకొని భిక్షాటన చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. మండలంలోని రొచ్చు పనుకు, కడగెడ, నేరేడు బంద తదితర గ్రామాల్లోని గిరిజనులు.. ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు నిత్యావసర సరుకులు సరఫరా చేయకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేస్తే.. కేవలం ఒక్క నెల సరుకులు మాత్రమే ఇవ్వాలని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 21 Apr 2023 17:53 IST

Tags :

మరిన్ని