హైదరాబాదీ బిర్యానీ అదుర్స్‌.. యూఎస్‌ అంబాసిడర్ ఎరిక్ గ్రాసెటి ట్వీట్‌

భారతీయ వంటకాలపై విదేశీయులు సైతం ఫిదా అవుతుంటారు. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ (Hyderabad Biryani)ని చాలా మంది ఇష్టంగా ఆరగిస్తారు. ఈ జాబితాలో యూఎస్‌ అంబాసిడర్ ఎరిక్ గ్రాసెటి  (Eric Garcetti) చేరిపోయారు. భారత్‌లో పర్యటిస్తున్న ఎరిక్ గ్రాసెటి.. పలు నగరాల్లోని పసందైన వంటకాలను రుచి చూస్తూ.. వాటిపై ప్రశంసలు కురిసిస్తున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీతోపాటు ఖుబానీ కా మీఠా ఆరగించారు. వీటి రుచికి పిదా అయ్యానంటూ ఎరిక్ గ్రాసెటి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆయన ట్వీట్‌ను యూఎస్‌ కాన్సులేట్ జనరల్‌ (హైదరాబాద్‌) షేర్‌ చేశారు. 

Published : 08 Jun 2023 13:06 IST
Tags :

మరిన్ని