News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 06 Jul 2022 12:43 IST
1/31
హైదరాబాద్‌లోని రహేజామైండ్‌ స్పేస్‌ నుంచి సైబర్‌ టవర్స్‌ మార్గంలో ఒకవైపు అండర్‌పాస్‌, మరోవైపు రహదారి ఉన్నా వాహనాల రద్దీ తగ్గడంలేదు. దీంతో మెట్రో నుంచి బయోడైవర్సిటీ మార్గంలో వాహనాలు బారులుతీరి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌లోని రహేజామైండ్‌ స్పేస్‌ నుంచి సైబర్‌ టవర్స్‌ మార్గంలో ఒకవైపు అండర్‌పాస్‌, మరోవైపు రహదారి ఉన్నా వాహనాల రద్దీ తగ్గడంలేదు. దీంతో మెట్రో నుంచి బయోడైవర్సిటీ మార్గంలో వాహనాలు బారులుతీరి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
2/31
3/31
4/31
ఎంఎస్‌ ధోనీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ ధోనీ క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. గురువారం ధోనీ 41వ బర్త్‌డే. దీంతో ఆంధ్ర అభిమానులు విజయవాడలోని నందిగామ వద్ద 41 అడుగుల ధోనీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. రేపు మామూలుగా ఉండదు అంటూ ట్విటర్‌లో హ్యాపీ బర్త్‌డే ట్యాగ్‌ జోడించి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎంఎస్‌ ధోనీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ ధోనీ క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. గురువారం ధోనీ 41వ బర్త్‌డే. దీంతో ఆంధ్ర అభిమానులు విజయవాడలోని నందిగామ వద్ద 41 అడుగుల ధోనీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. రేపు మామూలుగా ఉండదు అంటూ ట్విటర్‌లో హ్యాపీ బర్త్‌డే ట్యాగ్‌ జోడించి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
5/31
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా రథోత్సవం నిర్వహించారు. శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటాలతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులు వేలాదిగా తరలివచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా రథోత్సవం నిర్వహించారు. శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటాలతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
6/31
7/31
8/31
సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ అత్తిలి మల్లికార్జున్‌గౌడ్‌ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగిని శ్యామల బోనం ఎత్తుకొని నృత్యం చేశారు. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ అత్తిలి మల్లికార్జున్‌గౌడ్‌ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగిని శ్యామల బోనం ఎత్తుకొని నృత్యం చేశారు.
9/31
10/31
కురుక్షేత్రలోని రైల్వే స్టేషన్‌లో ఇటీవల మహాభారతానికి సంబంధించిన పెయింటింగ్స్‌, నిర్మాణాలతో అందంగా అలంకరిస్తున్నారు. ఈ పనులు త్వరలో పూర్తవనున్నాయి. ఇప్పటికే తీర్చిదిద్దిన చిత్రాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కురుక్షేత్రలోని రైల్వే స్టేషన్‌లో ఇటీవల మహాభారతానికి సంబంధించిన పెయింటింగ్స్‌, నిర్మాణాలతో అందంగా అలంకరిస్తున్నారు. ఈ పనులు త్వరలో పూర్తవనున్నాయి. ఇప్పటికే తీర్చిదిద్దిన చిత్రాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
11/31
12/31
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెటర్లు అక్కడి కాండీ నగరంలో సరదాగా ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లో శ్రీలంకపై గెలిచి భారత్‌ సిరీస్‌ గెలుచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెటర్లు అక్కడి కాండీ నగరంలో సరదాగా ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లో శ్రీలంకపై గెలిచి భారత్‌ సిరీస్‌ గెలుచుకుంది.
13/31
14/31
మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌కు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో వారు కలిసి దిగిన ఫొటోను ఆయన పంచుకున్నారు. మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌కు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో వారు కలిసి దిగిన ఫొటోను ఆయన పంచుకున్నారు.
15/31
మహానాడులో పాల్గొనేందుకు తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం మదనపల్లె వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మూడు రోజుల పాటు చంద్రబాబు సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. మహానాడులో పాల్గొనేందుకు తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం మదనపల్లె వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మూడు రోజుల పాటు చంద్రబాబు సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు.
16/31
17/31
దిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ పోలీసు ఎక్స్‌పో 2022లో వివిధ సంస్థలు తయారు చేసిన తుపాకులను ప్రదర్శించారు. ఇందులో అదానీ గ్రూప్‌, ఇజ్రాయెల్‌ వెపన్‌ ఇండస్ర్టీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న పీఎల్‌ఆర్‌ సిస్టమ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ తయారు చేసిన తుపాకులను కూడా ఉంచారు. దిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ పోలీసు ఎక్స్‌పో 2022లో వివిధ సంస్థలు తయారు చేసిన తుపాకులను ప్రదర్శించారు. ఇందులో అదానీ గ్రూప్‌, ఇజ్రాయెల్‌ వెపన్‌ ఇండస్ర్టీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న పీఎల్‌ఆర్‌ సిస్టమ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ తయారు చేసిన తుపాకులను కూడా ఉంచారు.
18/31
19/31
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజులపాటు కొనసాగే ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణంలో వివిధ కూరగాయలతో అలంకరించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజులపాటు కొనసాగే ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణంలో వివిధ కూరగాయలతో అలంకరించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు.
20/31
21/31
22/31
తిరుమలలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
23/31
24/31
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్‌లో కర్నూలు నుంచి కాజీపేటకు వెళ్తున్న బీసీఎన్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రెండు బోగీలు పూర్తిగా విడిపోవడంతో రైలు ఆగిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్‌లో కర్నూలు నుంచి కాజీపేటకు వెళ్తున్న బీసీఎన్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రెండు బోగీలు పూర్తిగా విడిపోవడంతో రైలు ఆగిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
25/31
26/31
వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన ఈ మహిళలకు పూర్తిస్థాయిలో పని దొరక్కపోవడంతో అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటలో గృహోపకరణాలను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన ఈ మహిళలకు పూర్తిస్థాయిలో పని దొరక్కపోవడంతో అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటలో గృహోపకరణాలను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
27/31
28/31
జూనోసిస్‌ దినోత్సవం సందర్భంగా పలువురు జంతు ప్రేమికులు తమ శునకాలను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు తీసుకువచ్చి ఉచిత టీకాలు వేయించారు. జూనోసిస్‌ దినోత్సవం సందర్భంగా పలువురు జంతు ప్రేమికులు తమ శునకాలను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు తీసుకువచ్చి ఉచిత టీకాలు వేయించారు.
29/31
30/31
హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నాయకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నాయకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
31/31
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా 87వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహించిన వేడుకలకు హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌ గెరె హాజరయ్యారు. దలైలామాకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా 87వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహించిన వేడుకలకు హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌ గెరె హాజరయ్యారు. దలైలామాకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని