News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 05 Jul 2022 20:06 IST
1/14
కర్నూలు బస్టాండ్‌లోని పార్కింగ్ స్థలం ఇది. వర్షం వచ్చిన ప్రతి సారి ఇక్కడ నీరు నిల్వ ఉంటోంది. కొన్నిసార్లు ద్విచక్ర వాహనాల ఇంజిన్‌లు కూడా నీట మునుగుతున్నాయి. ఈ సమస్యను పార్కింగ్‌ ఫీజులు వసూలు చేసే వ్యక్తులు పట్టించుకోవడం లేదని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు బస్టాండ్‌లోని పార్కింగ్ స్థలం ఇది. వర్షం వచ్చిన ప్రతి సారి ఇక్కడ నీరు నిల్వ ఉంటోంది. కొన్నిసార్లు ద్విచక్ర వాహనాల ఇంజిన్‌లు కూడా నీట మునుగుతున్నాయి. ఈ సమస్యను పార్కింగ్‌ ఫీజులు వసూలు చేసే వ్యక్తులు పట్టించుకోవడం లేదని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2/14
ముంబయిలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వర్షపు నీటిలో నడుస్తూనే ఓ మహిళ సెల్ఫీ తీసుకోవడానికి యత్నించగా.. పక్కనున్న వ్యక్తి ఇబ్బంది పడుతూనే ఆమెకు సహకరించాడు. మరో వైపు కొందరు విద్యార్థులు అవస్థలు పడుతూ పాఠశాలల నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు. ముంబయిలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వర్షపు నీటిలో నడుస్తూనే ఓ మహిళ సెల్ఫీ తీసుకోవడానికి యత్నించగా.. పక్కనున్న వ్యక్తి ఇబ్బంది పడుతూనే ఆమెకు సహకరించాడు. మరో వైపు కొందరు విద్యార్థులు అవస్థలు పడుతూ పాఠశాలల నుంచి తమ ఇళ్లకు చేరుకున్నారు.
3/14
4/14
5/14
ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట మున్సిపల్ హై స్కూల్‌లో చదువు బాగా చెబుతారని స్థానికంగా పేరుంది. దీంతో పాఠశాల ప్రారంభించిన తొలి రోజే తమ పిల్లలను చేర్పించుకోవాల్సిందిగా కోరుతూ తల్లిదండ్రులు ఇలా ఉపాధ్యాయుల చుట్టూ మూగారు. ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట మున్సిపల్ హై స్కూల్‌లో చదువు బాగా చెబుతారని స్థానికంగా పేరుంది. దీంతో పాఠశాల ప్రారంభించిన తొలి రోజే తమ పిల్లలను చేర్పించుకోవాల్సిందిగా కోరుతూ తల్లిదండ్రులు ఇలా ఉపాధ్యాయుల చుట్టూ మూగారు.
6/14
ఈ చిత్రంలో విద్యార్థులకు చూపిస్తోన్న పటంలోనివి కరెన్సీ నోట్లు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? అవి అదే పాఠశాలలో చదువుకున్న ఆర్బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సంతకం చేసినవి. 2010లో.. ఆర్బీఐ గవర్నర్‌ హోదాలో దువ్వూరి.. ఏలూరు రామచంద్రరావుపేటలోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలను సందర్శించారు. తన బాల్య స్మృతులను నెమరు వేసుకొని ఈ కరెన్సీ నోట్ల నమూనాలను, ఆటపరికరాలను అందజేశారు. ఆ నగదును విద్యార్థులకు చూపిస్తూ మీరూ అలాంటి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రోత్సహిస్తున్నారు ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు పి.కుటుంబరావు. ఈ చిత్రంలో విద్యార్థులకు చూపిస్తోన్న పటంలోనివి కరెన్సీ నోట్లు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? అవి అదే పాఠశాలలో చదువుకున్న ఆర్బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సంతకం చేసినవి. 2010లో.. ఆర్బీఐ గవర్నర్‌ హోదాలో దువ్వూరి.. ఏలూరు రామచంద్రరావుపేటలోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలను సందర్శించారు. తన బాల్య స్మృతులను నెమరు వేసుకొని ఈ కరెన్సీ నోట్ల నమూనాలను, ఆటపరికరాలను అందజేశారు. ఆ నగదును విద్యార్థులకు చూపిస్తూ మీరూ అలాంటి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రోత్సహిస్తున్నారు ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు పి.కుటుంబరావు.
7/14
8/14
హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌లో ‘ద బ్రైడల్‌ స్టోరీ’ ఎగ్జిబిషన్‌ ప్రారంభ తేదీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి శాన్వీ మేఘన, ఇతర మోడళ్లు పాల్గొన్నారు. ఫొటోలకు పోజులిస్తూ ఆద్యంతం సందడి చేశారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌లో ‘ద బ్రైడల్‌ స్టోరీ’ ఎగ్జిబిషన్‌ ప్రారంభ తేదీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి శాన్వీ మేఘన, ఇతర మోడళ్లు పాల్గొన్నారు. ఫొటోలకు పోజులిస్తూ ఆద్యంతం సందడి చేశారు.
9/14
10/14
మూడు రోజుల్లో 25 కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శ్రీకారం చుట్టారు. చిత్రకూట్‌లో ఆయన స్వయంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల్లో 25 కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శ్రీకారం చుట్టారు. చిత్రకూట్‌లో ఆయన స్వయంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
11/14
హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర ముఖ్య నేతలు కలిసి పార్టీ విస్తరణ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్‌ కార్యక్రమాలపై చర్చించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర ముఖ్య నేతలు కలిసి పార్టీ విస్తరణ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్‌ కార్యక్రమాలపై చర్చించారు.
12/14
కర్నూలు జిల్లా ఆదోనిలో ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను సీఎం వైఎస్‌ జగన్‌ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కూడా సంచి ధరించి విద్యార్థులతో కలిసి ఫొటో దిగారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను సీఎం వైఎస్‌ జగన్‌ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కూడా సంచి ధరించి విద్యార్థులతో కలిసి ఫొటో దిగారు.
13/14
14/14
కాకతీయుల చరిత్రను చాటి చెప్పేలా ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆవిష్కరించారు. కాకతీయుల చరిత్రను చాటి చెప్పేలా ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆవిష్కరించారు.

మరిన్ని