Published : 18 Sep 2021 23:23 IST

సిల్లీ పాయింట్‌

ర్నాల్డ్‌ ష్వాజ్‌నెగర్‌ నటించిన ‘ద టెర్మినేటర్‌’ సినిమా మిలియన్‌ 78.4డాలర్ల(రూ.571కోట్లు) కలెక్షన్లతో 1984లో బాక్సాఫీసు హిట్‌. ఆ సినిమా ద్వారా ఆ నిర్మాణ సంస్థకు ఇప్పటి వరకూ వచ్చిన ఆదాయం రూ.పదివేల కోట్లకు పైనే. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా హక్కుల్ని ఆ సంస్థ కేవలం ఒక్క డాలర్‌కే సొంతం చేసుకుందట. ‘టైటానిక్‌’ సినిమా తీసిన జేమ్స్‌ కేమెరూన్‌ దీనికీ దర్శకుడు. అయితే, తొలినాళ్లలో డబ్బు పెట్టడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాడట.

* కంప్యూటర్లూ, ఫోన్‌లలో పోర్న్‌ సైట్‌లను చూసినప్పటికన్నా భక్తికి సంబంధించిన వెబ్‌సైట్‌లను చూసినప్పుడే మాల్‌వేర్‌ బారిన పడే అవకాశం ఎక్కువని ఓ అధ్యయనంలో తేలింది.

* అంతర్జాలంలో శోధనకు అంతులేదు అన్న అర్థంలో పెట్టిన ‘గూగుల్‌’ అనే పదం జిఓఓజిఓఎల్‌(గూగల్‌) నుంచి వచ్చింది. ఒకటి పక్కన వంద సున్నాలు పెట్టినప్పుడు వచ్చే సంఖ్యనే గణితంలో గూగల్‌ అంటారు. ‘అనంతం’ అని అర్థం.

* బాగా ఏడ్చేవాళ్లు ఎక్కువగా నవ్వుతారనేది ఓ అధ్యయనం. దీని క్కారణం ఏడ్చినప్పుడు శరీరం నొప్పుల్ని తగ్గించి, శరీరానికి సాంత్వననిచ్చే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుందట.

* అంతర్జాతీయ వ్యోమగాములు తప్పకుండా రష్యన్‌ భాషను నేర్చుకోవాలి. అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌ కార్యకలాపాలను నియంత్రించే వ్యవస్థ ఆ భాషలోనే ఉంటుంది మరి.

* మామూలుగా అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ల పిల్లలు కజిన్స్‌ అవుతారు. కానీ ఒకేలా ఉండే కవలలకు పుట్టిన పిల్లలు జన్యుపరంగా సొంత అన్నదమ్ముల కిందికే వస్తారట. ఎందుకంటే ఒకే తల్లికి పుట్టిన పిల్లల డీఎన్‌ఏ 25శాతం ఒకేలా ఉంటే, ఇద్దరు వేరు వేరు ఐడెంటికల్‌ ట్విన్స్‌కి పుట్టిన పిల్లల డీఎన్‌ఏ కూడా అలానే ఉంటుందట.


జపాన్‌లోని సుమో రెజ్లర్లు పిల్లల్ని ఏడిపిస్తే ఆ పిల్లలు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారనేది నమ్మకం. దీనికోసం ప్రత్యేకంగా ఓ వేడుకను నిర్వహించి పిల్లల్ని ఏడిపించమని సుమోల చేతికందిస్తారు. ఇది వందల ఏళ్ల నుంచీ వస్తున్న ఆచారం.


నాసా స్పేస్‌ సూట్‌ ఖరీదు సుమారు రూ.90 కోట్ల్లు. అందులో 70 శాతం బ్యాక్‌ప్యాక్‌, కంట్రోల్‌ మోడ్‌ తయారీకోసమే అవుతుందట.


అమెరికాలోని సుప్రీంకోర్టు భవనంమీద బాస్కెట్‌ బాల్‌ కోర్టు ఉంది.


డిఫిల్లియా గ్రయి... అనే రకం పువ్వులు మామూలుగా తెలుపు రంగులో ఉంటాయి. కానీ వాటిమీద వర్షం లేదా నీళ్లు పడినప్పుడు అవి గాజులా పారదర్శకంగా మారిపోతాయి.


రోజూ మూడు పెద్ద క్యారెట్లను కొన్ని వారాలపాటు తింటే రక్తంలో బీటాకెరోటిన్‌ శాతం పెరిగి చర్మం నారింజ వర్ణంలోకి మారిపోతుంది.


జర్మనీలోని ఉప్పర్టల్‌లో లెగో వంతెన ఉందట. నిజానికి ఇది కాంక్రీటుతో కట్టిన వంతెనే కానీ లెగోలను తలపించేలా రంగులు వేశారు.


అర్జెంటీనా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియొనెల్‌ మెస్సీ ప్రపంచంలోనే ఉత్తమ క్రీడాకారుల్లో ఒకడు. అతడు ఈమధ్య బార్సిలోనా క్లబ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు కార్చాడు. ఆ సమయంలో అతడు వాడి పడేసిన టిష్యూని ఓ అభిమాని సేకరించి ఆన్‌లైన్‌లో మిలియన్‌ డాలర్ల(రూ.7.35కోట్లు)కు వేలానికి పెట్టాడు.


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని