అరవైల్లో... జ్ఞాపకశక్తికి

అరవై ఏళ్ళు దాటాక చాలామందికి జ్ఞాపకశక్తి సమస్య వస్తుంటుంది. అలాంటివాళ్ళకి మల్టీవిటమిన్‌ మాత్రలు చాలా మేలు చేస్తాయట.

Published : 10 Feb 2024 23:14 IST

రవై ఏళ్ళు దాటాక చాలామందికి జ్ఞాపకశక్తి సమస్య వస్తుంటుంది. అలాంటివాళ్ళకి మల్టీవిటమిన్‌ మాత్రలు చాలా మేలు చేస్తాయట. అవి వాడనివాళ్ళకన్నా వాడేవాళ్ళ మెదడు వయసు రెండేళ్ళు తగ్గుతోందట! అమెరికాలోని మాస్‌ బ్రిగామ్‌ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్‌ చిరాగ్‌ వ్యాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని నిరూపించింది. అరవై ఏళ్ళు దాటిన సుమారు 21వేల మందితో- రెండేళ్ళపాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవాళ్ళని రెండు బృందాలుగా విభజించారు. ఓ బృందానికి విటమిన్‌లనీ, మరో బృందానికి విటమిన్‌లేని మామూలు చప్పరించే బిళ్ళల్నీ(ప్లాసిబో) ఇచ్చారట. రెండేళ్ళపాటు వాడాక వాళ్ళకి వివిధ సమస్యలిచ్చి పరీక్షిస్తే- తర్కం, ప్రణాళికలు వేయడం తదితర అన్ని అంశాల్లోనూ రెండు బృందాలూ సమానంగానే సామర్థ్యం చూపాయట. కానీ- జ్ఞాపకశక్తి విషయంలో మాత్రం విటమిన్స్‌ తీసుకున్నవాళ్ళు మిగతావాళ్ళకన్నా ఎన్నోరెట్లు పైచేయి సాధించడం చూశారట! కాబట్టి, వైద్యుల సూచన మేరకు సీనియర్‌ సిటిజన్లు వీటిని తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..