తలనొప్పి వాళ్ళకే ఎందుకంటే...

మగవాళ్ళకంటే మహిళలకి తలనొప్పి మూడురెట్లు ఎక్కువగా వస్తోందంటోంది అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వే ఒకటి.

Published : 10 Feb 2024 23:17 IST

గవాళ్ళకంటే మహిళలకి తలనొప్పి మూడురెట్లు ఎక్కువగా వస్తోందంటోంది అమెరికాలో ఇటీవల నిర్వహించిన సర్వే ఒకటి. ‘గ్లోబల్‌ బర్డన్‌ ఆఫ్‌ డిసీజెస్‌’ తాజా నివేదిక ప్రకారం- ఒక నెలలో తీవ్రంగానో, తక్కువగానో, మధ్యస్థంగానో తలనొప్పి ఉందని చెప్పేవాళ్ళలో మహిళలే ఎక్కువంటోంది. అంతేకాదు, ఈ తలనొప్పికీ స్త్రీల రుతుక్రమానికీ దగ్గరి సంబంధం ఉందనీ చెబుతోంది. మామూలు తలనొప్పులే కాదు మైగ్రెయిన్‌లాంటి తీవ్రమైన వాటికీ ఇదే కారణమంటోంది. అందులోనూ ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ పాత్రే ఎక్కువట. ఇప్పటిదాకా స్త్రీలు చిన్నవిషయాలకే ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు కాబట్టే వాళ్ళకి ఎక్కువ తలనొప్పులుంటాయని భావిస్తూవచ్చారు. ఈ అధ్యయనం దాని మూలమేంటో చెప్పడానికి ప్రయత్నించింది. కానీ- మైగ్రెయిన్‌లాగే అనిపించి కొంతకాలం ఉండి మళ్ళీ రాకుండా- మరో ఆరునెలలకో ఏడాదికో కనిపించి వేధించేే ‘క్లస్టర్‌ తలనొప్పి’ మాత్రం మగవారిలోనే ఎక్కువని ఇదే సర్వే చెబుతోంది. దానికైతే ఇప్పటిదాకా స్పష్టమైన కారణం తెలియట్లేదట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..