అతినిద్ర అరుదేమీ కాదు..!

ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా సరే... కొందరు రోజంతా నిద్రమత్తులోనే ఉంటారు. ‘బద్ధకిస్టు’, ‘సోమరి’ అంటూ వీళ్ళపైన ఇట్టే ముద్రలేసేస్తారు, కానీ ఇదో తీవ్రమైన వ్యాధి.

Published : 11 Feb 2024 00:28 IST

డెనిమిది గంటలపాటు నిద్రపోయినా సరే... కొందరు రోజంతా నిద్రమత్తులోనే ఉంటారు. ‘బద్ధకిస్టు’, ‘సోమరి’ అంటూ వీళ్ళపైన ఇట్టే ముద్రలేసేస్తారు, కానీ ఇదో తీవ్రమైన వ్యాధి. ఐడియోపతిక్‌ హైపర్‌సోమ్నియా అంటారు దాన్ని. కాకపోతే, శాస్త్రవేత్తలు ఇంతకాలం ఇదో అరుదైన సమస్యగానే భావిస్తూ వచ్చారు. లక్షమందిలో కేవలం 37 మందికే ఉంటుందన్నది వాళ్ళ అంచనా. అంటే, 0.037 శాతం మాత్రమేనన్నమాట! అది నిజం కాదని తేల్చింది తాజా అధ్యయనం ఒకటి. అమెరికాలోని విస్కాన్సిన్‌- మాడిసన్‌ వర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో 800 మందిని పరీక్షిస్తే- వాళ్ళలో 12 మందికి ఈ తీవ్ర సమస్య ఉన్నట్టు గుర్తించారట. దీన్నే లక్షమందికి వర్తింపచేస్తే 1.5 శాతం అవుతుంది. ఏ రకంగా చూసినా- అది ఇదివరకటి అంచనాకన్నా చాలా ఎక్కువ. ప్రపంచమంతా నిద్రలేమి సమస్యపైనే ఎక్కువ దృష్టిపెట్టడం వల్లే ఈ సమస్య బయటపడట్లేదంటూ అతినిద్ర సమస్య ఉన్నవాళ్ళందరూ ‘ఐడియోపతిక్‌ హైపర్‌సోమ్నియా’ పరీక్ష చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు పరిశోధకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..