అచ్చయినవి చదివితేనే...

‘ఆ స్కూల్లో ఎల్‌కేజీ నుంచే డిజిటల్‌ క్లాసురూమ్‌లు ఉన్నాయి’ అంటూ పిల్లల్ని వాటిల్లో చేర్పించడానికి ముందు... ఓసారి ఆలోచించుకోవాలంటున్నారు పరిశోధకులు. ‘విద్యార్థులు డిజిటల్‌ ఉపకరణాలతో చదవడం మంచిదా- ముద్రించిన వాటితో నేర్చుకుంటే మంచిదా?’ అన్న ప్రశ్నతో స్పెయిన్‌కి చెందిన వాలెన్షియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు.

Published : 04 Feb 2024 00:07 IST

‘ఆ స్కూల్లో ఎల్‌కేజీ నుంచే డిజిటల్‌ క్లాసురూమ్‌లు ఉన్నాయి’ అంటూ పిల్లల్ని వాటిల్లో చేర్పించడానికి ముందు... ఓసారి ఆలోచించుకోవాలంటున్నారు పరిశోధకులు. ‘విద్యార్థులు డిజిటల్‌ ఉపకరణాలతో చదవడం మంచిదా- ముద్రించిన వాటితో నేర్చుకుంటే మంచిదా?’ అన్న ప్రశ్నతో స్పెయిన్‌కి చెందిన వాలెన్షియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. సుమారు 4.7 లక్షల మంది విద్యార్థుల తీరుతెన్నుల్ని విశ్లేషించారు. ట్యాబ్‌లోనో, ఫోన్‌లోనో పాఠాలు చదివేటప్పుడు వచ్చే పాప్‌-అప్స్‌, స్క్రీన్‌ వెలుతుర్లో ఏర్పడే మార్పులు వంటివి విద్యార్థుల్ని డిస్టర్బ్‌ చేస్తున్నాయని పసిగట్టారు. హైస్కూలు పిల్లలు కొంతవరకూ ఈ అవాంతరాలని పక్కకిపెట్టి ఏకాగ్రత చూపగలుగుతున్నా... అంతకన్నా చిన్నవాళ్లకి అది సాధ్యం కావడంలేదట. ఇలా డిజిటల్‌ ఉపకరణాలకి అలవాటుపడ్డ చిన్నారులు యూట్యూబుకో, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాల ఆకర్షణకో త్వరగా గురవుతున్నారట. వాటిల్లోని పైపై సంభాషణలూ, హాస్యాలూ, సంక్షిప్త సమాచారాలకి అలవాటుపడి లోతైన ఏ విషయాన్నీ గ్రహించలేక పోతున్నారట. అలాకాకుండా- చిన్నప్పటి నుంచీ ముద్రించిన పుస్తకాలకే పరిమితమైన వాళ్ళు ఎంత పెద్ద సమాచారాన్నయినా ఇట్టే అర్థంచేసుకోగలుగు తున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..