weekly horoscope: రాశిఫలం(డిసెంబరు 17-23)

ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 17 Dec 2023 00:19 IST


ముఖ్యకార్యాల్లో శుభఫలితాలుంటాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. పట్టుదల అవసరం. ఏ విషయంలోనూ తొందరవద్దు. సన్నిహితుల సూచనలు పనిచేస్తాయి. చంచల నిర్ణయాలతో కాలం వృథా కాకుండా జాగ్రత్తపడాలి. వ్యాపారంలో విఘ్నాలు తొలగుతాయి. రుణసమస్యలు పెరగవచ్చు. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. ఇష్టదేవతను స్మరించండి, శుభం జరుగుతుంది.  


కాలం వ్యతిరేకంగా ఉంది. ఏకాగ్రత పెంచాలి. కాలం వృథా కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మితసంభాషణ మేలుచేస్తుంది. పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. విఘ్నాలను సమయస్ఫూర్తితో అధిగమించాలి. నూతన ప్రయోగాలకు సమయం కాదు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.


ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంది. తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలుంటాయి. సకాలంలో బాధ్యతలను పూర్తిచేయండి. ఓర్పు శక్తినిస్తుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. చెడు ఊహించవద్దు. ఒక సమస్య పరిష్కారమవుతుంది. న్యాయం మీ పక్షాన నిలుస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


అద్భుతమైన ఫలితాలున్నాయి. ఉద్యోగంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. పదవీలాభం సూచితం. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. పలువిధాలుగా అభివృద్ధిని సాధించగలరు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. ధన ధాన్యాభివృద్ధి ఉంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభం జరుగుతుంది.


అదృష్టయోగం సూచితం. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. నిజాయతీగా పనిచేసి పెద్దల్ని మెప్పిస్తారు. విజయావకాశాలు మెరుగు పడతాయి. స్పష్టంగా మాట్లాడాలి. ఆర్థికంగా శుభకాలం. వ్యాపారంలో బాగుంటుంది. ఆవేశం పనికిరాదు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.


వ్యాపారయోగం బ్రహ్మాండంగా ఉంది. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కీర్తిప్రతిష్ఠలు సాధిస్తారు. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఉద్యోగంలో అభీష్టసిద్ధి కలుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. వస్తు, వస్త్రప్రాప్తి ఉంది. ఇష్టదైవాన్ని స్మరించండి, మంచివార్త వింటారు.


మంచి ఆలోచనలతో నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. మనశ్శాంతి పెరుగుతుంది. న్యాయం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. శివారాధన శుభప్రదం.


వ్యాపారంలో కలిసివస్తుంది. విశేష ధనలాభం సూచితం. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సకాలంలో మీ బాధ్యతలను పూర్తిచేయండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఎక్కడా నిరుత్సాహపడవద్దు. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.


అదృష్టయోగముంది. అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్యం చేరువలోనే ఉంది. దేనికీ తొందరవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విజయం లభించేవరకూ కృషిచేయాలి. చెడు ఊహించవద్దు. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, మేలు చేకూరుతుంది.


మనోబలంతో పనులు ప్రారంభించండి. నిరుత్సాహ పరిచే పరిస్థితులున్నాయి. బుద్ధిబలంతో పరిష్కరించండి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ధర్మమార్గంలో కర్తవ్యాలను పూర్తిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి, శాంతంగా పరిష్కరించాలి. పనులు వాయిదా వేయవద్దు. ఉత్సాహంగా ఉండండి. ఇష్టదైవాన్ని దర్శించండి, మేలు జరుగుతుంది.


శుభఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో గొప్ప విజయం ఉంది. పదవీలాభం సూచితం. బంగారు భవిష్యత్తును అందుకుంటారు. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారంలో బాగుంటుంది. గుర్తింపూ గౌరవం లభిస్తాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. గృహ వాహన యోగాలున్నాయి. స్థిరాస్తులు పెరుగుతాయి. ఇష్టదైవ స్మరణం శుభదాయకం.


శ్రేష్ఠమైన ఉద్యోగఫలితాలున్నాయి. అధికార లాభముంది. ప్రతిభతో మెప్పించి పెద్దల ప్రశంసలు పొందుతారు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఎవరితోనూ విభేదించవద్దు. నిరంతర సాధనపై దృష్టిపెట్టండి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..