Dudhsagar: భూతల స్వర్గం.. ఈ పాల నురగల జలపాతం!
వైరల్‌గా మారిన దూద్‌సాగర్ వీడియో
ఇంటర్నెట్ డెస్క్: రుతుపవనాల(Monsoon) రాక మొదలు.. దేశంలో అడవులు, కనుమల్లో ఎక్కడ చూసినా హరిత శోభ ఉట్టిపడుతుంది! ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో(Western Ghats)ని ప్రకృతి.. జలపాతాలు, పచ్చందాలతో కనువిందు చేస్తుంటుంది. ఇటీవలి వర్షాలకు ఈ ప్రాంతం మరింత రమణీయంగా మారింది. గోవా(Goa)లోని దూద్ సాగర్(Dudhsagar) జలపాతం.. భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. ఎత్తయిన కనుమల్లోంచి జాలువారుతోన్న పాల నురగల్లాంటి జలధార.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ఒకరు తాజాగా ట్విటర్ వేదికగా పంచుకున్నారు. జలపాతం ఎదురుగా ఉన్న వంతెనపైనుంచి ఓ రైలు వెళ్తుండటం.. ఈ దృశ్యాన్ని మరింత అందంగా మార్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
‘నైరుతి రుతుపవనాలు గోవాను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి. అంతటా తడి, పచ్చదనం పరచుకుంటుంది. దూద్ సాగర్ జలపాతం అద్భుతంగా కనిపిస్తుంది. పశ్చిమ కనుమల సౌందర్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది’ అని రాసుకొచ్చారు. నెటిజన్లు సైతం ఈ వీడియోను చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘అద్భుతమైన దృశ్యం ఇది. రైల్లోనూ జలపాతం హోరును, నీటి తుంపర్లను ఆస్వాదించొచ్చు’ అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టారు. పశ్చిమ కనుమల్లోని మాండవి నదిపై ఉందీ జలపాతం. ఇక్కడ 1017 అడుగుల ఎత్తునుంచి నీళ్లు కిందికి దూకుతాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్దఎత్తున ఇక్కడికి తరలివస్తుంటారు. ఇటీవల కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి దూద్‌సాగర్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. దీన్ని దేశంలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొంటూ.. మరపురాని జ్ఞాపకాల కోసం ఈ ప్రాంతాన్ని సందర్శించాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi Sanjay: భాజపా-తెరాస కార్యకర్తల ఘర్షణ.. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
-
Sports News
Independence Day : స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ.. మెగా ఈవెంట్లలో భారత క్రీడాలోకం ఇలా..!
-
General News
Independence Day: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
-
Movies News
Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
-
India News
Indian flag: అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా..!
-
India News
Azadi Ka Amrit Mahotsav: ఆరు ఖండాల్లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం