Subhreet: నెటిజన్ల హృదయాలు గెలిచిన డ్యాన్సర్
బుల్లితెర, వెండితెరలపై ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, డ్యాన్సర్లు తమదైన శైలిలో డ్యాన్స్ చేసి, ప్రేక్షకులను అలరించిన సందర్భాలెన్నో.
ఇంటర్నెట్‌డెస్క్: బుల్లితెర, వెండితెరలపై ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, డ్యాన్సర్లు తమదైన శైలిలో డ్యాన్స్ చేసి, ప్రేక్షకులను అలరించిన సందర్భాలెన్నో. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తిండిపోతారు. అలాంటి వారిలో శుభ్రీత్ కౌర్ గుమ్మాన్ ఒకరు. అంగవైకల్యాన్ని సైతం ఆత్మ విశ్వాసంతో అధిగమించి ‘ఇండియాస్ గాట్ టాలెంట్’లో సెకండ్ రౌండ్‌కు క్వాలిఫై అవడం ద్వారా దేశవ్యాప్తంగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకోగా.. విశేష స్పందన వస్తోంది. ‘నా మొదటి టీవీ డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ చికినీ ఛమేలీ ఏడేళ్ల తర్వాత మళ్లీ మీకోసం.. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా’ అంటూ ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు