Manike Mage Hithe: ‘మాణికే మాగే హితే’కు ఎయిర్ హోస్టెస్ అద్భుత స్టెప్పులు
‘మాణికే మాగే హితే’ పాటకు ఓ ఎయిర్ హోస్టెస్ వేసిన స్టెప్పులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి....
ఇంటర్నెట్ డెస్క్: ‘మాణికే మాగే హితే..’ కొన్ని నెలలుగా ఇంటర్నెట్‌ని ఊపేస్తోన్న పాట. శ్రీలంక గాయని యుహానీ డిసిల్వా పాడిన ఈ ప్రేమ గీతానికి భారత్‌లోనూ విశేష ఆదరణ లభిస్తోంది. లిరిక్స్ అర్థం కాకపోయినప్పటికీ ఈ ట్యూన్‌కు మనసుపారేసుకున్నారు. క్రేజీగా ఉందంటూ ఎంతోమంది ప్రముఖులు ఈ పాటను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాలో ఈ ప్రేమ గీతానికి ఫాలోవర్స్ సంఖ్య అంతా ఇంతా కాదు. అనేకమంది రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటకు ఓ ఎయిర్ హోస్టెస్ చేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇండిగో విమానంలో.. ఆ సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్ అఫ్రీన్ ‘మాణికే మాగే హితే’కు స్టెప్పులేసింది. ప్రయాణికులంతా కిందకు దిగిన తర్వాత ఖాళీగా ఉన్న విమానంలో.. సహచరి వీడియో తీస్తుండగా అఫ్రీన్ నృత్యం చేసింది. ట్యూన్‌కు అనుగుణంగా ఆమె చేసిన డ్యాన్స్, హావభావాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అఫ్రీన్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. ఇప్పటికే 13 మిలియన్ల మంది వీక్షించారు. 1.2 మిలియన్ల లైకులు వచ్చాయి. ఆ వీడియోను మీరూ చూసేయండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్‌రేట్‌ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి