Viral Video: ఇదీ సమయస్ఫూర్తి.. ధైర్యం అంటే..!

అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటే సహజంగానే ఆ సమయంలో ఏమీ తోచదు. అలాంటప్పుడు ధైర్యంగా

Published : 27 Feb 2022 11:22 IST

పట్నా: అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటే సహజంగానే ఆ సమయంలో ఏమీ తోచదు. అలాంటప్పుడు ధైర్యంగా ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే దాన్నుంచి బయటపడొచ్చు. మరీ ప్రాణాలమీదికి వచ్చే విషయాల్లో ‘షార్ప్‌’గా ఆలోచిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. బిహార్‌లోని పట్నాలో ఓ వ్యక్తి ఇలాగే తన ప్రాణాలను కాపాడుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే.. పట్నా రైల్వేస్టేషన్‌లో రైలు రావడానికి ముందు ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి పట్టాలపై పడిపోయాడు. ఆయన తేరుకుని పైకి వచ్చేందుకు యత్నించేలోపే రైలు దూసుకొచ్చేసింది. వెంటనే సమయస్ఫూర్తిని ప్రదర్శించిన సదరు వ్యక్తి.. రైలు పట్టాల మధ్యలో కదలకుండా అలాగే ఉండిపోయాడు. రైలు వెళ్లిపోగానే పట్టాల పైనుంచి లేచి బయటకు వచ్చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఆ సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని